అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- October 15, 2026
అబుదాబి: యూఏఈలోని అబుదాబిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బంగ్లాదేశ్‌కు చెందిన తల్లి, ఆమె 15 ఏళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. కారును నడుపుతున్న తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటన అక్టోబర్ 12న రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వరూప్ కాంతి బిశ్వాస్ తన భార్య ఓషిమా చౌధురి, 15 ఏళ్ల కుమారుడు ఒరిట్రో బిశ్వాస్‌తో కలిసి ఓ సామాజిక కార్యక్రమానికి కారులో బయలుదేరారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో అల్ వత్బా బ్రిడ్జి సమీపంలో వెళ్తుండగా, వేగంగా వచ్చిన మరో కారు వీరి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బారియర్‌ను బలంగా ఢీకొంది. దీంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. కారులో ఉన్న ఓషిమా, ఆమె కుమారుడు ఒరిట్రో ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వరూప్ కాంతి బిశ్వాస్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో లేబర్ వెల్ఫేర్ విభాగం ఫస్ట్ సెక్రటరీ మహమ్మద్ ఇస్మాయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన మంగళవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. స్వరూప్ కాంతి బిశ్వాస్ స్వస్థలం బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్ ప్రాంతం బోవాల్ఖాలి కాగా, ఓషిమా కుటుంబం అదే ప్రాంతంలోని రావోజాన్కు చెందినదని సామాజిక కార్యకర్తలు తెలిపారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







