విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- October 15, 2026
విజయవాడ: విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం నగరానికి విచ్చేసిన రాష్ట్రపతి.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థప్రసాదాలతో పాటు పవిత్ర చిత్రపటాన్ని ఆలయ కమిటీ ఘనంగా బహూకరించింది.
సరస్ మేళా ప్రారంభం.. డిజిటల్ పేమెంట్‌తో చీర కొనుగోలు
పర్యటనలో భాగంగా గురువారం నగరంలో ‘జాతీయ సరస్ మేళా’ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత ఆవశ్యకతను ఆమె గుర్తుచేశారు. మహిళలే కుటుంబాలకు మూలస్తంభాలని, నేడు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటూ స్వయంగా ఉపాధి కల్పించుకుంటుండటం ఎంతో గర్వకారణమని ప్రశంసించారు. ఈ మేళాలో భాగంగా ఓ స్టాల్‌ను సందర్శించిన రాష్ట్రపతి.. స్వయంగా డిజిటల్ పేమెంట్ (UPI) చేసి ఒక చీరను కొనుగోలు చేయడం విశేషం. అనంతరం అక్కడే స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో కలిసి ఆప్యాయంగా భోజనం చేశారు.
ఘన వీడ్కోలు పలికిన హోంమంత్రి అనిత
సరస్ మేళా కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇండియన్ డిఫెన్స్‌కు చెందిన స్పెషల్ ఫ్లైట్‌లో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత ఘన వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







