ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- October 17, 2026
మస్కట్: ఒమన్లోని ముసందమ్ గవర్నరేట్ పరిధిలో రాస్ అల్ షేక్ మసూద్ సమీప సముద్ర ప్రాంతంలో మత్స్యకారులు, నావికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రవాణా, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. సముద్రంలో మునిగిపోయిన కంటైనర్ నౌక నుంచి కొన్ని కంటైనర్లు సముద్రంలో తేలియాడుతున్నాయని, వాటిలో ప్రమాదకర పదార్థాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
2026 అక్టోబర్ 14న GFS PRIDE అనే కంటైనర్ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన అనంతరం నౌకలోని పలు కంటైనర్లు సముద్రంలో తేలుతూ పరిసర ప్రాంతాల్లోకి కొట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని ప్రమాదకర పదార్థాలను కలిగి ఉన్నట్లు ఒమన్ రవాణా, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాస్ అల్ షేక్ మసూద్ సమీప సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు, ఇతర నావికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్ల దగ్గరకు వెళ్లడం, వాటిని తాకడం లేదా తరలించేందుకు ప్రయత్నించడం చేయవద్దని స్పష్టం చేశారు. సముద్రంలో ఎక్కడైనా తేలియాడే కంటైనర్లు లేదా అనుమానాస్పద సరుకు కనిపిస్తే వెంటనే 7211134 నంబర్కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
సముద్రంలో నెలకొన్న పరిస్థితిని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కంటైనర్లను వెలికితీసే చర్యలు చేపట్టడంతో పాటు ప్రజల భద్రత, సముద్ర పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారు, నౌకల్లో ప్రయాణించేవారు అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







