షార్క్‌ తాత్కాలిక చేపల మార్కెట్‌ ప్రారంభం..!!

- October 17, 2026 , by Maagulf
షార్క్‌ తాత్కాలిక చేపల మార్కెట్‌ ప్రారంభం..!!

షార్క్‌: షార్క్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక చేపల మార్కెట్‌ను క్యాపిటల్‌ గవర్నర్‌ షేక్‌ అబ్దుల్లా సలేం అల్‌ అలీ ప్రారంభించారు. ప్రధాన చేపల మార్కెట్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా 160 స్టాళ్లతో తాత్కాలిక చేపల మార్కెట్‌ను ప్రారంభించారు. ఏడాది పాటు చేపల విక్రయాలు నిరంతరాయంగా కొనసాగించేందుకు ఈ ప్రత్యామ్నాయ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు.
ప్రధాన షార్క్‌ చేపల మార్కెట్‌ పునరాభివృద్ధి పనులకు సుమారు ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పనులు పూర్తయిన తర్వాత ఆధునిక సదుపాయాలతో మార్కెట్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఉన్న 160 స్టాళ్లకు బదులుగా పునరుద్ధరించిన మార్కెట్‌లో 240 స్టాళ్లు అందుబాటులోకి రానున్నాయి.

కొత్త మార్కెట్‌లో వ్యాపారులు, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయనున్నారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు తాత్కాలిక మార్కెట్‌లో రోజువారీ చేపల విక్రయాలు, వేలం ప్రక్రియ కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com