బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- October 17, 2026
ముహర్రఖ్: గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం, పంపిణీ చేయడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి బహ్రెయిన్‌లోని ముహర్రఖ్లో ఒక వాణిజ్య సంస్థతో పాటు దాని గోదాంను అధికారులు మూసివేశారు. బహ్రెయిన్ పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గోదాంలో మొక్కజొన్న పిండి, మాంసం, ఘనీభవించిన ఆహార పదార్థాలు గడువు ముగిసినప్పటికీ నిల్వ ఉంచినట్లు తనిఖీల్లో వెల్లడైంది. వీటిలో కొన్ని పదార్థాలపై 2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన గడువు తేదీలు ఉన్నట్లు అధికారులు విడుదల చేసిన వీడియోలో కనిపించింది.మాంసం ప్రాసెసింగ్ ప్రాంతంలో పరిశుభ్రత లోపాలు, సరిగా నిర్వహణ లేని పరికరాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత వ్యాపార సంస్థ, గోదాంను తక్షణమే పరిపాలనా పరంగా మూసివేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
బాధ్యులను తదుపరి చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు తెలిపింది.
వాణిజ్య మార్కెట్లు, రిటైల్ దుకాణాలు, గోదాంలు, పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తోంది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ధరల స్థిరత్వం, వాణిజ్య నిబంధనల అమలే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపడుతోంది. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. మార్చి 1 నుంచి జూలై 31 వరకు ఆహార దుకాణాల్లో 2,156, బేకరీల్లో 234, కేంద్ర మార్కెట్లలో 98, ఇతర వాణిజ్య సంస్థల్లో 703 తనిఖీలు నిర్వహించారు. మొత్తం 178 ఉల్లంఘనలు గుర్తించగా, వాటిలో 176 ధరలకు సంబంధించినవి కాగా, మిగిలిన రెండు వాణిజ్య మోసాలకు సంబంధించినవి.
ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనలను ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయం, ఇతర అక్రమ కార్యకలాపాలను సహించబోమని స్పష్టం చేశారు.వినియోగదారులు ఉల్లంఘనలను గుర్తిస్తే [email protected] ఇమెయిల్ ద్వారా, జాతీయ తవాసుల్ ఫిర్యాదుల వ్యవస్థ ద్వారా లేదా 17111225 వాట్సాప్ నంబర్‌కు సమాచారం అందించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







