పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- October 17, 2026
హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ సిబ్బంది యూనిఫామ్‌లో డ్యాన్సులు చేయడంపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఇకపై యూనిఫామ్ ధరించి వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నా, డ్యాన్సులు చేసినా కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన శుక్రవారం హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్ల అధిపతులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల కాలంలో పలువురు పోలీసు సిబ్బంది, అధికారులు పండుగలు, ప్రైవేట్ కార్యక్రమాల్లో యూనిఫామ్‌లోనే డ్యాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గణేశ్ నిమజ్జనం, మేడారం జాతర, వీడ్కోలు సమావేశాలు వంటి సందర్భాల్లో జరిగిన ఈ ఘటనలు పోలీసు శాఖ క్రమశిక్షణపై ప్రజా విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో డీజీపీ తాజా ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ యూనిఫామ్ అనేది బాధ్యత, అధికారం, క్రమశిక్షణకు ప్రతీక అని, దాని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీజీపీ నొక్కిచెప్పారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడటం సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







