క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్

- October 17, 2026 , by Maagulf
క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్

హైదరాబాద్:  హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్య సంస్థలైన సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) సంయుక్తంగా రోగి-కేంద్రీకృత క్యాన్సర్ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేశాయి. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ సీమెన్స్ హెల్తినీర్స్ (Siemens Healthineers) అభివృద్ధి చేసిన Biograph Horizon PET/CT పరికరాన్ని ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అత్యాధునిక ఇమేజింగ్ సాంకేతికత ద్వారా శరీరంలోని జీవక్రియల వివరాలను, శరీర నిర్మాణంతో కలిపి విశ్లేషించడం సాధ్యమవుతుంది. దీనివల్ల క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో (Staging) ఖచ్చితంగా అంచనా వేయడంతో పాటు, వ్యాధి ఇతర శరీర భాగాలకు విస్తరించిందో లేదో సులభంగా గుర్తిస్తారు. ఫలితంగా ఆంకాలజిస్టులు ప్రతి రోగి యొక్క వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మరింత ప్రభావవంతమైన, సమగ్రమైన చికిత్స ప్రణాళికలను రూపొందించడానికి, రోగులు చికిత్సకు ఏ విధంగా స్పందిస్తున్నారో నిరంతరం పర్యవేక్షించడానికి ఈ సాంకేతికత కీలక ఆధారంగా నిలుస్తుంది.

రోగుల సౌకర్యానికి ప్రాధాన్యత: సురక్షితమైన రేడియేషన్ మరియు ప్రత్యేక సదుపాయాలు
Biograph Horizon PET/CT సాంకేతికత కేవలం వ్యాధి నిర్ధారణకే కాక, సాధారణ పరీక్షలతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్లు వంటి సంక్లిష్ట పరిస్థితుల ఇమేజింగ్‌లోనూ అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, స్కాన్ సమయంలో రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉండేలా ఈ పరికరంలో ప్రత్యేక నియంత్రణ వ్యవస్థలను అమర్చారు. అంతేకాకుండా, గరిష్ఠంగా 227 కిలోగ్రాముల బరువు ఉన్న రోగులు కూడా ఏలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష చేయించుకునేలా ప్రత్యేక స్కాన్ బెడ్ సౌకర్యాన్ని డిజైన్ చేశారు. సాంకేతిక పురోగతికి సానుభూతి, మానవీయ శ్రద్ధను జోడించి రోగులకు మెరుగైన అనుభూతిని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆసుపత్రి యాజమాన్యం మరియు ‘క్యాన్సర్ ట్రీట్‌మెంట్ సర్వీసెస్ ఇంటర్నేషనల్’ (CTSI) ప్రతినిధులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com