విజయ్ సేతుపతి పాన్-ఇండియా మూవీ నుంచి క్రేజీ అప్డేట్
- October 17, 2026
విజయ్ సేతుపతి పాన్-ఇండియా మూవీ నుంచి క్రేజీ అప్డేట్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’. ఈ సినిమా షూటింగ్ (చిత్రీకరణ) మొత్తం విజయవంతంగా పూర్తయినట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకులను థియేటర్లలో ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ రోలర్‌కోస్టర్ రైడ్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా గ్రాండ్ యాక్షన్ ఎంటర్టైనర్
పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్లో విజయ్ సేతుపతి అత్యంత విభిన్నమైన, బలమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు, జరీనా వహాబ్, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







