భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు

- October 19, 2026 , by Maagulf
భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు

న్యూ ఢిల్లీ: భారతదేశం మరియు న్యూజిలాండ్ దేశాల మధ్య ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement – FTA) అక్టోబర్ 20 (మంగళవారం) నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలపేతం చేసే దిశగా ఈ చారిత్రాత్మక ఒప్పందం కీలక అడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ఏయే రంగాలకు దక్కనుంది భారీ ఊతం?
గతంలో ఉన్న కఠినమైన టారిఫ్ (సుంకం) నిబంధనల కారణంగా ఇరు దేశాల మధ్య ఎగుమతులు కొంతవరకు పరిమితమయ్యేవి. అయితే, ఈ కొత్త ఎఫ్‌టీఏ డీల్ ద్వారా ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, జ్యువెలరీ (ఆభరణాలు), ప్లాస్టిక్స్ మరియు టెక్స్‌టైల్స్ వంటి రంగాలకు చెందిన ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

6 బిలియన్ డాలర్ల సరికొత్త మార్కెట్ అవకాశం
తాజా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా భారత్‌కు అంతర్జాతీయంగా సుమారు 6 బిలియన్ డాలర్ల విలువైన సరికొత్త మార్కెట్ అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వ్యాపారాలకు, ఎగుమతిదారులకు న్యూజిలాండ్‌లో మరిన్ని మెరుగైన వ్యాపార అవకాశాలు లభించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com