ఎమిరేటీ మహిళల్ని అభినందించిన అరబ్ విమెన్ ఆర్గనైజేషన్
- August 26, 2016
ఎమిరేటీ విమెన్స్ డే సందర్భంగా అరబ్ విమెన్ ఆర్గనైజేషన్, షేక్ ఫాతిమా బింట్ ముబారక్ (చైర్ విమెన్ ఆఫ్ ది జనరల్ విమెన్స్ యూనియన్, సుప్రీం ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ డెవలప్మెంట్ ఫౌండేషన్, హెడ్ ఆఫ్ ది సుప్రీం కౌన్సిల్ ఫర్ మదర్ హుడ్ అండ్ చైల్డ్ హుడ్)కి శుభాకాంక్షలు తెలిపింది. గత ఏడాది షేక్ ఫాతిమా, ఎమిరేటీ విమెన్ డేని ప్రకటించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మెర్వత్ తల్లావి ఈ సందర్భంగా ఎమిరేటీ మహిళలు తమ తమ రంగాల్లో సాధించిన విజయాల్ని కొనియాడారు. ఎమిరేటీ మహిళల అభ్యున్నతి కోసం షేక్ పాతిమా తీసుకుంటున్న చర్యల్ని ప్రస్తావించి, ఆమె మద్దతును అభినందించారు. భవిష్యత్తులోనూ అరబ్ మహిళలకు ఆమె మరింత సహాయ సహాకారలు అందిస్తారని ఆకాంక్షించారు. ఎమిరేటీ మహిళలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 66 శాతం సాధించడాన్ని ప్రస్తావిస్తూ, అందులో సగం ముఖ్యమైన పదవులేనని చెప్పారు. యూఏఈలో మహిళా పారిశ్రామికవేత్తలు 45 బిలియన్ దిర్హామ్‌ల పెట్టుబడితో ముందంజలో ఉండగా, పలువురు మహిళలు పోలీస్, మరియు ఆర్మీలో చేరుతుండడం అభినందనీయమని తల్లావి చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







