కడుపులో మాదక ద్రవ్యాలు
- August 26, 2016
పాకిస్తాన్‌కి చెందిన ఓ వ్యక్తిని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు, షార్జా షరియా కోర్టులో హాజరుపరిచారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు, నిందితుడు ఉన్న హోటల్ రూమ్‌లో సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ వారికి ఎలాంటి మాదక ద్రవ్యాలూ దొరకలేదు. తదనంతరం అతన్ని విచారించగా, కడుపులో క్యాప్సూల్స్ ఉన్నాయనీ, వాటి ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. 37 క్యాప్సూల్స్‌లో డ్రగ్స్‌ని స్మగ్లింగ్ చేశానని పోలీసులకు తెలిపాడు నిందితుడు. దాంతో పోలీసులు, నిందితుడ్ని ఆసుపత్రికి తరలించి, డ్రగ్స్ క్యాప్సూల్స్‌ని వెలికి తీశారు. షార్జా షరియా న్యాయస్థానంలో కేసు విచారణ సెప్టెంబర్ 21వ తేదీకి వాయిదా పడింది. మరో కేసులో షార్జా న్యాయస్థానం ఐదుగురు ఆసియాకి చెందిన వ్యక్తుల్ని డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా తేల్చింది
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







