డెలివరీ బైక్‌లపై కువైట్‌లో ట్రాఫిక్ శాఖ కొరడా..!!
- October 23, 2026
కువైట్: రహదారి భద్రతను మెరుగుపరచడం, ప్రమాదకర డ్రైవింగ్‌ను అరికట్టడమే లక్ష్యంగా డెలివరీ సేవలకు వినియోగిస్తున్న మోటార్‌సైకిళ్లపై కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, ట్రాఫిక్ జరిమానాలు విధించి పలు మోటార్‌సైకిళ్లు, ఇతర వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ అఫైర్స్ విభాగం అధిపతి బ్రిగేడియర్ అహ్మద్ అల్ అజ్మీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. రహదారులపై క్రమశిక్షణ పెంపొందించడం, వాహనదారులు మరియు ఇతర రహదారి వినియోగదారుల భద్రతకు ముప్పు కలిగించే డ్రైవింగ్ విధానాలను నియంత్రించడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది.
డెలివరీ మోటార్‌సైకిల్ రైడర్లు ట్రాఫిక్ నిబంధనలు, వృత్తిపరమైన మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై ట్రాఫిక్ పెట్రోలింగ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.ఈ క్రమంలో పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టుబడిన పలువురు ఉల్లంఘనకారులను ట్రాఫిక్ శాఖకు చెందిన సీజింగ్ కేంద్రానికి తరలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు వివిధ ట్రాఫిక్ జరిమానాలు విధించడంతో పాటు, పలు మోటార్‌సైకిళ్లు, ఇతర వాహనాలను నిర్దేశిత ఇంపౌండ్ యార్డుకు తరలించారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. దేశం నుంచి బహిష్కరణ ప్రక్రియకు లోబడి ఉన్న వ్యక్తులను సంబంధిత అధికారులకు అప్పగించే చర్యలు కూడా చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా డెలివరీ మోటార్‌సైకిళ్లపై తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మోటార్‌సైకిల్ రైడర్లు, డెలివరీ సంస్థలు ట్రాఫిక్ చట్టాలు, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. తమ భద్రతతో పాటు ఇతర రహదారి వినియోగదారుల ప్రాణాలను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. దుబాయ్ ముందస్తు చర్యలు..!!
- ప్రిస్క్రిప్షన్ల పరిశీలన, మందుల భద్రత ఫార్మసిస్టర్ల బాధ్యతలు..!!
- డెలివరీ బైక్‌లపై కువైట్‌లో ట్రాఫిక్ శాఖ కొరడా..!!
- భారత రాయబారితో భారతి అసోసియేషన్ ప్రతినిధుల భేటీ..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై ఖతార్ ప్రధాని, అమెరికా విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు
- దుబాయ్‌లో ఆన్లైన్ పెట్టుబడుల మోసం.. 30 ఏళ్ల పొదుపు Dh400,000 పైగా స్వాహా!
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్..
- సౌదీ విమానాశ్రయం, చమురు క్షేత్రంపై హూతీ దాడులు..
- కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి







