దోహా మెట్రో బస్సు రూట్లలో మార్పులు..!!
- October 25, 2026
దోహా: ఖతార్‌లోని దోహా మెట్రో రెడ్ లైన్ పరిధిలో నడిచే మెట్రోలింక్, మెట్రోఎక్స్‌ప్రెస్ సేవలకు సంబంధించి కొత్త రూట్లను ప్రకటించారు. అల్ ఖస్సార్ నుంచి ముషెరీబ్ మెట్రో స్టేషన్ల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ మార్పులు వర్తించనున్నాయి. నేటి నుంచి కొత్త రూట్లు అమల్లోకి వచ్చాయి.
M103 బస్సు రూటులో మార్పు
M103 మెట్రోలింక్ బస్సు ముషెరీబ్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ స్టేషన్ ముషెరీబ్ మెట్రో స్టేషన్‌లోని ఎగ్జిట్ 1 పక్కనే ఉంటుంది. ఈ బస్సు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి అందుబాటులో ఉంటుంది. అల్ మామౌరా ఏరియా 43కు సేవలు అందిస్తూ, అల్ సూడాన్ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంది.
M119 బస్సు రూటులో మార్పు
M119 బస్సు ఇకపై అల్ ఖస్సార్ మెట్రో స్టేషన్‌లోని ఎగ్జిట్ 1 నుంచి బయలుదేరుతుంది. ఈ రూటు ద్వారా ఉమ్ లేఖ్బా ప్రాంతానికి రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఈ బస్సు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నడుస్తుంది.
ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని రెడ్ లైన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత..రూ.4 కోట్ల గంజాయి స్వాధీనం!
- బహ్రెయిన్‌లో కర్జకాన్ సముద్ర తీరానికి కొత్త రూపు..!!
- దోహా మెట్రో బస్సు రూట్లలో మార్పులు..!!
- పిల్లల్లో కిడ్నీ వ్యాధులు.. లక్షణాలు కనిపించేలోపే గుర్తించడం ముఖ్యం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ లు..!!
- కువైట్‌లో అమీరీ దివాన్ హార్స్ వేలం..!!
- యూఏఈలో బాలికను ఒంటరిగా వదిలేసిన మహిళ.. కోర్టు కీలక తీర్పు..!!
- యూఏఈలో ఈ-ఇన్వాయిసింగ్ అమలుకు గడువు.. నెలకు Dh5,000 జరిమానా!
- బెర్న్‌లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
- ఖతార్‌లో దోమల నివారణకు మార్గదర్శకాలు జారీ..!!







