చిరు 151వ సినిమా గీతా ఆర్ట్స్ పతాకంపై....
- August 26, 2016
చిరంజీవి రీఎంట్రీ సినిమా అయిన 'ఖైదీ నెం.150' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మెగాస్టార్ తదుపరి సినిమాకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పట్నుంచే మొదలయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే చిరు 151వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారన్నది తెలియనుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలిసింది. 150వ సినిమా లాగే ఆ తర్వాత వచ్చే సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అల్లు అరవింద్ ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారట.
ఇక చిరు 150వ సినిమా 'ఖైదీ నెం.150' విషయానికి వస్తే తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి'కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







