మ హాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై సునీల్ చిత్రం
- August 26, 2016
మ హాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై సునీల్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతోంది. మలయాళంలో విజయవంతమైన 'టు కంట్రీస్'కి రీమేక్‌గా ఎన్.శంకర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, టీన్యూస్ ఎండీ సంతోష్‌కుమార్, తెదేపా నాయకుడు పరిటాల శ్రీరామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సునీల్ మాట్లాడుతూ ''నా శైలికి తగ్గ కథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. మలయాళంలో దిలీప్ తెరకెక్కించిన సినిమాలు చాలావరకు తెలుగులో విజయవంతంగా రీమేక్ అయ్యాయి.శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తప్పకుండా అందరికీ వినోదాన్ని పంచుతుంది'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''వినోదంతో పాటు అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన చిత్రం 'టు కంట్రీస్'. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో సాగుతుంది. మలయాళంలో రూ.55 కోట్లు వసూలు చేసిన అలాంటి ఓ మంచి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండడం ఆనందంగా ఉంది.ఇందులోని పాత్రని సునీల్ తప్ప మరెవ్వరూ చేయలేరేమో అనిపించింది. మాతృకకి సంగీతం అందించిన గోపీసుందర్ తెలుగులోనూ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు చిత్రీకరణ జరుపుతామ''న్నారు. గోపీసుందర్ మాట్లాడుతూ ''మలయాళంలో చేసిన 'టు కంట్రీస్' సినిమా సంగీత దర్శకుడిగా నాకెంతో సంతృప్తినిచ్చింది.ఆ చిత్రానికి తెలుగులోనూ పనిచేస్తుండడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం సరికొత్త ట్యూన్లు జోడించబోతున్నా'' అన్నారు. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ ''పూలరంగడు', 'భీమవరం బుల్లోడు' తర్వాత సునీల్‌తో మరో సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది'' అన్నారు. కార్యక్రమంలో బి.గోపాల్, క్రాంతిమాధవ్, సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, కె.అచ్చిరెడ్డి, ఎస్.వి.కృష్ణారెడ్డి, రాజా రవీంద్ర, టీన్యూస్ సీఈవో నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







