సౌదీలో విద్యుత్‌, వాటర్ ఛార్జీల సవరణ..!!

- October 27, 2026 , by Maagulf
సౌదీలో విద్యుత్‌, వాటర్ ఛార్జీల సవరణ..!!

రియాద్‌: సౌదీ అరేబియాలో విద్యుత్‌, వాటర్, మురుగునీటి సేవల ఛార్జీలను సవరిస్తున్నట్లు సౌదీ ఎనర్జీ కంపెనీ, నేషనల్ వాటర్ కంపెనీ ప్రకటించాయి. కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.  గృహ విద్యుత్‌ వినియోగానికి నెలకు 6,000 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు 21 హలాలాలు, అంతకుమించి వినియోగానికి 33 హలాలాలు వసూలు చేయనున్నారు.

వాణిజ్య, ప్రైవేటు ఆరోగ్య, విద్యా సంస్థలకు 6,000 యూనిట్ల వరకు 25 హలాలాలు, ఆపై 35 హలాలాలు వర్తిస్తాయి. పారిశ్రామిక రంగానికి 23 హలాలాలు, వ్యవసాయ రంగానికి వినియోగాన్ని బట్టి 19 నుంచి 23 హలాలాలు నిర్ణయించారు. ప్రభుత్వ రంగానికి యూనిట్‌కు 35 హలాలాలు వసూలు చేస్తారు. విద్యుత్‌ వినియోగదారులకు సర్క్యూట్‌ బ్రేకర్‌ సామర్థ్యాన్ని బట్టి నెలవారీ స్థిర ఛార్జీలు కూడా వర్తిస్తాయి. గృహ వినియోగదారులకు ఈ ఛార్జీలు SR70 నుంచి SR100 వరకు ఉండగా, పారిశ్రామిక, వాణిజ్య, ప్రభుత్వ, ఆరోగ్య, ప్రైవేటు విద్యా రంగాలకు SR350 నుంచి SR900 వరకు ఉంటాయి.

నీటి వినియోగానికి నెలకు 15 క్యూబిక్‌ మీటర్ల వరకు ఒక్కో క్యూబిక్‌ మీటర్‌కు SR1, 15–30 క్యూబిక్‌ మీటర్లకు SR2, 30–45 క్యూబిక్‌ మీటర్లకు SR4, 45 క్యూబిక్‌ మీటర్లకు మించి SR6 వసూలు చేయనున్నారు. మురుగునీటి ఛార్జీలు వినియోగ శ్లాబును బట్టి SR0.50 నుంచి SR3 వరకు ఉంటాయి. నీటి మీటర్‌ పరిమాణాన్ని బట్టి నెలవారీ ఛార్జీలు SR20 నుంచి SR100 వరకు, మురుగునీటి మీటర్‌ ఛార్జీలు SR10 నుంచి SR50 వరకు నిర్ణయించారు. అదనపు యూనిట్‌కు నీటిపై SR20, మురుగునీటిపై SR10 అదనపు ఛార్జీ వర్తిస్తుంది.

కొత్త టారిఫ్‌ల పూర్తి వివరాల కోసం నేషనల్ వాటర్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 8004411110 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com