దుబాయ్‌లో కార్ నంబర్ ప్లేట్ కు భారీ ధర.. !!

- October 27, 2026 , by Maagulf
దుబాయ్‌లో కార్ నంబర్ ప్లేట్ కు భారీ ధర.. !!

దుబాయ్‌లో కార్ నంబర్ ప్లేట్ కు భారీ ధర.. !!

దుబాయ్‌: ప్రత్యేక వాహన నంబర్ ప్లేట్ల వేలంలో భారీ ధరలు పలికాయి. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) నిర్వహించిన 121వ బహిరంగ వేలంలో మొత్తం Dh65.721 మిలియన్ల ఆదాయం వచ్చింది. ఇందులో CC44 నంబర్ ప్లేట్ అత్యధికంగా Dh6.72 మిలియన్లకు అమ్ముడైంది.

 హిల్టన్ దుబాయ్ అల్ హబ్తూర్ సిటీలో ఈ వేలం నిర్వహించారు. ఇందులో రెండు, మూడు, నాలుగు, ఐదు అంకెలతో కూడిన మొత్తం 60 ప్రత్యేక నంబర్ ప్లేట్లను విక్రయానికి ఉంచారు. 

వేలంలో BB18 నంబర్ ప్లేట్ Dh6.62 మిలియన్లకు, BB80 నంబర్ ప్లేట్ Dh5.9 మిలియన్లకు అమ్ముడయ్యాయి. BB117 నంబర్ ప్లేట్ Dh1.016 మిలియన్ల ధర పలికింది. AA, BB, CC, H, U, V, W, X, Y, Z కోడ్‌లతో కూడిన నంబర్ ప్లేట్లను వేలం వేశారు. 

ఓపెన్, ఆన్‌లైన్ వేలాల ద్వారా పారదర్శకత, కొనుగోలుదారులందరికీ సమాన అవకాశాలను కల్పిస్తున్నామని RTA తెలిపింది. ప్రత్యేక నంబర్ ప్లేట్లు వాటి యజమానుల అభిరుచులకు, వ్యక్తిగత గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com