సల్మానియాలో ప్రత్యేక బ్రెస్ట్ హెల్త్ యూనిట్ ప్రారంభం..!

- October 27, 2026 , by Maagulf
సల్మానియాలో ప్రత్యేక బ్రెస్ట్ హెల్త్ యూనిట్ ప్రారంభం..!

మనామా: మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంతో పాటు, వైద్య చికిత్స సమయంలో వారి వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చేలా సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖదీజా బ్రెస్ట్ హెల్త్ యూనిట్‌ ప్రారంభమైంది. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ (SCH) ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బహ్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ జలీలా బింట్ అల్ సయ్యద్ జవాద్ హసన్‌తో పాటు పలువురు సీనియర్ ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు

నజాహ్ అల్ ఆలీ తన దివంగత తల్లి ఖదీజా జ్ఞాపకార్థం, తన దివంగత తండ్రి చేసిన సేవలకు గౌరవ సూచకంగా ఈ యూనిట్ ఏర్పాటుకు సహకరించారు. మానవతా సేవల పట్ల తమ కుటుంబానికి ఉన్న నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనమని పేర్కొన్నారు.

మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు

ప్రత్యేక వైద్య సేవలను విస్తరించడం, ప్రజల భాగస్వామ్యంతో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం ఎంతో ముఖ్యమని డాక్టర్ షేక్ మహమ్మద్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల సీఈఓ డాక్టర్ మరియం అథ్బీ అల్ జలహ్మా మాట్లాడుతూ.. ఈ కొత్త యూనిట్‌ ద్వారా మహిళలకు బ్రెస్ట్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక సేవలు మరింత మెరుగ్గా అందుతాయని చెప్పారు. రోగుల వ్యక్తిగత గోప్యతను కాపాడటంతో పాటు, వారి అవసరాలకు తగిన వైద్య సేవలు అందించడంపై దృష్టి సారిస్తామని వివరించారు.

సేవా కార్యక్రమాలను కొనసాగిస్తా..

తన తల్లిదండ్రులు అనుసరించిన మానవతా సేవల వారసత్వాన్ని కొనసాగించడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని నజాహ్ అల్ ఆలీ తెలిపారు. బహ్రెయిన్ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే కార్యక్రమాల ద్వారా వారి సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కొత్త యూనిట్‌ ద్వారా మహిళలకు ప్రత్యేక రొమ్ము ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, రోగులకు మరింత గోప్యతతో కూడిన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com