బుర్‌కిని బ్యాన్‌పై వ్యతిరేకత
- August 26, 2016
బీచ్‌లలో బుర్‌కిని బ్యాన్ విధించిన ఫ్రాన్స్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఫ్రాన్స్‌తో సంబంధాలు తెంచుకోవాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఫ్రాన్స్‌తో సంబంధాల్ని ఇస్లామిక్ దేశాలన్నీ రద్దు చేసుకోవాల్సిందేననీ, ఇది ఇస్లాంకి వ్యతిరేకమైన చర్య అని వారు నినదించారు. సౌదీ మీడియా ఫిగర్ మునా అబు సులేమాన్ ఈ మేరకు ఓ ఉద్యమాన్ని లేవదీశారు. ఫ్రాన్స్ చర్య జాతి వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. పరస్పర గౌరవం లేని చోట సంబంధాలు నిలవబోవనీ, ఫ్రాన్స్ ఉద్దేశ్యపూర్వంగా ఇస్లామిక్ దేశాల పట్ల, ఇస్లాం మతానికి చెందిన మహిళల పట్ల అహంకార పూరిత ధోరణిని అవలంభిస్తోందని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో మునా అబు సులేమాన్ చేపట్టిన ఈ ఉద్యమానికి పెద్దయెత్తున స్పందన లభిస్తోంది. ఇస్లామిక్ దేశాల నుంచి మూకుమ్మడిగా ఒత్తిడి పెరిగితే ఫ్రాన్స్ దిగివచ్చే అవకాశాలున్నాయని ఆమె అంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







