గాయపడ్డ ఒమనీలకు రెడ్ క్రిసెంట్ వైద్య సహాయం
- August 26, 2016
యెమెన్‌లో జరుగుతున్న యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డ 1500 మందికి వైద్య సహాయం అందించేందుకు రెడ్ క్రిసెంట్ వైద్య సహాయం అందించనుంది. యూఏఈ, సుడాన్ మరియు ఇండియాల్లోని ఆసుపత్రుల ద్వారా వారికి వైద్య సహాయం అందించనున్నట్లు ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ (ఇఆర్‌సి) వెల్లడించింది. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచనలతో ఈ చర్యలు చేపట్టినట్లు ఇఆర్‌సి మీడియా సమావేశంలో తెలిపింది. యెమెన్ సహకారంతో అక్కడ గాయపడ్డవారిని 'ఎయిర్ లిఫ్ట్' చేసి, వారికి వైద్య సహాయం అందించనున్నారు. అత్యవసర వైద్య సహాయం కోసం 50 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసి, యూఏఈ ఆసుపత్రులకు తరలిస్తామని ఈ సందర్భంగా ఇఆర్‌సి వెల్లడించింది. గాయపడ్డవారు ప్రస్తుతం యెమెన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారికి సహాయకులుగా ఉండేవారి ఖర్చుల్ని సైతం తాము భరించనున్నట్లు ఇఆర్‌సి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







