ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపుపై సౌదీ, కువైట్ చర్చలు..!!

- October 29, 2026 , by Maagulf
ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపుపై సౌదీ, కువైట్ చర్చలు..!!

రియాద్: మిడిలీస్టులో ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి భద్రతలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సౌదీ అరేబియా, కువైట్ విదేశాంగ మంత్రులు చర్చించారు. రియాద్‌లో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సోదర సంబంధాలను సమీక్షించడంతో పాటు, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే మార్గాలపై చర్చించారు.

ఈ ప్రాంతంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకురావడానికి చేపడుతున్న ప్రయత్నాలపై ఇరువురు మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు.

హౌతీ దాడులను ఖండించిన మంత్రులు

సౌదీ అరేబియాపై ఉగ్రవాద హౌతీ మిలీషియా జరిపిన దాడులను ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఖండించారు. తమ దేశాల భద్రత, స్థిరత్వానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా సమష్టిగా ఎదుర్కొనే విషయంలో సౌదీ అరేబియా, కువైట్ పరస్పర సంఘీభావంతో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో ఇరు దేశాల మధ్య సహకారం, సమన్వయం కొనసాగుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com