బిగ్ అలర్ట్.. దీపావళి ఆఫర్ల పేరుతో భారీ మోసాలు
- October 31, 2026
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు..ఆన్లైన్ మార్కెట్లో రకరకాల పండుగ ఆఫర్లు సందడి చేస్తుంటాయి. భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు, తక్కువ ధరకే ఖరీదైన వస్తువులు అంటూ కనువిందు చేసే ప్రకటనలు కనిపిస్తుంటాయి. అయితే, వీటిలో కొన్ని నిజమైన ఆఫర్లు కాగా.. మరికొన్ని సైబర్ నేరగాళ్లు వేసే మోసపు వలలు. ప్రముఖ షాపింగ్ యాప్స్ పేరుతో నకిలీ యాప్స్ సృష్టించి అమాయకులను నిండా ముంచేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పండుగ హడావుడిలో పడి మోసపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
నమ్మలేనంత తక్కువ ధరలు..భారీ డిస్కౌంట్లు
మార్కెట్లో లక్షల రూపాయల విలువ చేసే ఐఫోన్‌ను కేవలం రూ.699కే ఇస్తామని, ఖరీదైన బ్రాండెడ్ షూస్‌ను రూ.399కే అందిస్తామని వచ్చే ప్రకటనలను అసలు నమ్మకూడదు. సాధారణ ధరతో పోలిస్తే 80 నుంచి 90 శాతం తగ్గింపు కనిపిస్తే అది మోసపూరిత ఆఫర్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. నకిలీ యాప్‌లలో ఉత్పత్తుల పేర్లు, వాటి వివరణలు కూడా ఒకదానికొકటి పొంతన లేకుండా ఉంటాయి.
క్యాష్ ఆన్ డెలివరీ (COD) పేరిట మోసాలు
చాలామంది ఆన్లైన్లో వస్తువులు కొనేటప్పుడు ముందస్తు చెల్లింపులు చేయకుండా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ని ఎంచుకుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న కొన్ని నకిలీ యాప్స్ ఆర్డర్ సమయంలో COD ఆప్షన్ చూపించి, చివరకు యూపీఐ (UPI) ద్వారానే పేమెంట్ చేయాలని పట్టుబడుతుంటాయి. ముఖ్యంగా క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేసినప్పుడు వ్యాపార సంస్థ పేరు బదులుగా ఏదైనా వ్యక్తిగత పేర్లు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
ఫేక్ రివ్యూలు, రేటింగ్లను నమ్మొద్దు
ఏదైనా వస్తువు కొనేముందు కస్టమర్ రివ్యూలు, రేటింగ్స్ చూడటం సహజం. అయితే నకిలీ యాప్‌లలో వేల సంఖ్యలో పాజిటివ్ రివ్యూలు ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే, కొద్దిమంది మాత్రమే ఒకే రకమైన కామెంట్లు పెట్టినట్లు లేదా ఒకే యూజర్ అకౌంట్ అన్ని ఉత్పత్తులకూ అవే రివ్యూలు ఇచ్చినట్లు తేలుతుంది.
నకిలీ యాప్‌లను గుర్తించడానికి మరో సులువైన మార్గం డెలివరీ తేదీలను పరిశీలించడం. ఉదాహరణకు.. అక్టోబర్ 10న ఆర్డర్ చేస్తే, ఆగస్టు 27న డెలివరీ చేస్తామనే విచిత్రమైన తేదీలు కనిపిస్తుంటాయి. ఇలాంటి అసాధ్యమైన లాజిక్‌లు ఉంటే ఆ యాప్ కచ్చితంగా నకిలీదే అని గ్రహించాలి.
సోషల్ మీడియా ప్రకటనలు & రూ.30 కోట్ల భారీ కుంభకోణం
ఈ నకిలీ యాప్‌ల ప్రచారం కోసం మోసగాళ్లు సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు. ఫేస్బుక్లో భారీగా ఖర్చు పెట్టి వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని కేవలం రూ.799 విలువైన కుర్తీని ఆన్లైన్లో ఆర్డර් చేయగా రూ.6,450 మోసపోయిన ఉదంతం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గ్రేటర్ నోయిడాలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. ఏకంగా రూ.30 కోట్ల విలువైన భారీ సైబర్ మోసాల నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహమాడిన జమ్మూ కాశ్మీర్ సీఎం
- ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. భారత్‌కు యూఏఈ సంఘీభావం
- ఖతార్‌లో ఘనంగా కళాంజలి 2026 యువజనోత్సవం.. ఓవరాల్ ఛాంపియన్‌గా రాజగిరి పబ్లిక్ స్కూల్
- జెడ్డాలో జాతీయ ఐక్యతా దినోత్సవం.. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు నివాళులు
- బిగ్ అలర్ట్.. దీపావళి ఆఫర్ల పేరుతో భారీ మోసాలు
- బహ్రెయిన్‌లో ప్రవాస డ్రైవర్లకు దేశ బహిష్కరణ ముంపు?
- మనామా డైలాగ్ 2026..సముద్ర భద్రతపై చర్చలు..!!
- ఒమన్‌లో క్యాన్సర్‌పై అవగాహనకు భారీ వాక్‌థాన్..!!
- ప్రాంతీయ భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి కీలక చర్చలు..!!
- కువైట్‌లో ఉద్యోగులకు ఊరట..!!







