కువైట్‌లో ఉద్యోగులకు ఊరట..!!
- October 31, 2026
కువైట్: ప్రైవేటు రంగ ఉద్యోగుల వేతనాలు, జీతాల నుంచి చేసే కోతలకు సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) కీలక నిబంధనలను మరోసారి గుర్తుచేసింది. కార్మికుల ఆర్థిక హక్కులను కాపాడేందుకు లేబర్ చట్టంలోని నిబంధనలను యజమానులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
లేబర్ చట్టంలోని ఆర్టికల్ 28 ప్రకారం.. ఉద్యోగ ఒప్పందంలో అంగీకరించిన వేతనాన్ని ఒప్పందం అమల్లో ఉన్నంతకాలం తగ్గించడానికి వీల్లేదు. అలాగే ఆర్టికల్ 59 (A) ప్రకారం.. యజమాని వద్ద ఉద్యోగి తీసుకున్న అప్పులు లేదా రుణాల చెల్లింపు కోసం నెలవారీ జీతం నుంచి గరిష్ఠంగా 10 శాతం మాత్రమే మినహాయించాలి. అంతేకాకుండా ఈ రుణాలపై యజమానులు ఎలాంటి వడ్డీ వసూలు చేయకూడదు.
ఇక ఆర్టికల్ 59 (B) ప్రకారం.. అప్పుల చెల్లింపు కోసం ఉద్యోగి జీతం నుంచి చేసే జప్తులు, బదిలీలు లేదా ఇతర మినహాయింపులు మొత్తం వేతనంలో 25 శాతానికి మించకూడదు. ఇందులో యజమానికి చెల్లించాల్సిన అప్పులు కూడా ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ రకాల బకాయిలు ఉన్నప్పుడు భరణం (Alimony) చెల్లింపులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని PAM స్పష్టం చేసింది.
కార్మికుల వేతన భద్రతను కాపాడటం, యజమానులు కార్మిక చట్టాలను ఉల్లంఘించకుండా చూడటమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాస డ్రైవర్లకు దేశ బహిష్కరణ ముంపు?
- మనామా డైలాగ్ 2026..సముద్ర భద్రతపై చర్చలు..!!
- ఒమన్‌లో క్యాన్సర్‌పై అవగాహనకు భారీ వాక్‌థాన్..!!
- ప్రాంతీయ భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి కీలక చర్చలు..!!
- కువైట్‌లో ఉద్యోగులకు ఊరట..!!
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫుడ్ డెలివరీ రైడర్ మృతి..!!
- యూఏఈలో వాహనదారులకు ఊరట.. నవంబర్‌లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
- ఇరాన్‌పై ట్రంప్ మరో దాడికి సిద్ధమా?
- వైఎస్సార్సీపీ గల్ఫ్ కమిటీ నియామకం..షేక్ అబ్దుల్లాకు సలహాదారు బాధ్యతలు
- సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: కేంద్ర మంత్రి జైశంకర్







