జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహమాడిన జమ్మూ కాశ్మీర్ సీఎం

- October 31, 2026 , by Maagulf
జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహమాడిన జమ్మూ కాశ్మీర్ సీఎం

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (56) ప్రముఖ టెలివిజన్ జర్నలిస్ట్ నిధి రజ్దాన్ (49)ను వివాహం చేసుకున్నారు. శనివారం తమ వివాహానికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా సీఎం అధికారికంగా వెల్లడించారు. “నిన్న ఒక కొత్త ప్రయాణం మొదలైంది…” అని పేర్కొంటూ నిధి రజ్దాన్‌ను ట్యాగ్ చేసి, తమ పెళ్లికి సంబంధించిన నాలుగు ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం
శుక్రవారం నాడు ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ (ప్రత్యేక వివాహ చట్టం) కింద వీరి వివాహ నమోదు ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. ఒమర్ అబ్దుల్లా మొదటి భార్య పాయల్‌తో రాజీకి వచ్చిన తర్వాత, ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా వారి వివాహం అధికారికంగా రద్దయింది. ఇక 49 ఏళ్ల నిధి రజ్దాన్‌కు కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేడుకలు
శ్రీనగర్, న్యూఢిల్లీలలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఒమర్ అబ్దుల్లా తల్లిదండ్రులు ఫరూఖ్ అబ్దుల్లా, మోలీ, ఆయన ముగ్గురు సోదరీమణులు మరియు ఇతర సన్నిహిత బంధువులతో పాటు.. నిధి రజ్దాన్ తల్లిదండ్రులైన ప్రముఖ పాత్రికేయురాలు ఎం.కె. రజ్దాన్, సరళా రజ్దాన్ కూడా ఈ వివాహ వేడుకలకు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com