ఖతార్‌లోని జెరియన్ నజీమాలో నీటి సరఫరా నిలిపివేత..!!
- November 01, 2026
దోహా: ఖతార్‌లోని జెరియన్ నజీమా ప్రాంతంలో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన కహ్రామా.. నవంబర్ 1నుంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఈ అంతరాయం కొనసాగుతుందని పేర్కొంది.
వతన్ విన్యాసాల్లో భాగంగా..
వతన్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవస్థల సన్నద్ధతను పరీక్షించడం, వినియోగదారుల్లో ముందస్తు అవగాహన పెంచడం, అత్యవసర సమయాల్లో స్పందన సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని కహ్రామా వివరించింది. విద్యుత్, నీటి సేవల విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడంతో పాటు నిరంతర సేవల అందుబాటును నిర్ధారించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- కాంగోను వణికిస్తున్న ‘ఎబోలా’.. 5వేలకు పైగా మరణాలు
- దుబాయ్ రైడ్ 2026 విజయవంతం.. షేక్ జాయెద్ రోడ్డు పై సైక్లిస్టుల సందడి
- సౌదీ అరేబియా కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..!!
- యూఏఈ లాటరీ తాజా విజేతలు.. ముగ్గురికి తలా Dh100,000..!!
- జెట్ స్కీ ప్రమాదం.. పౌరుడిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- బహ్రెయిన్‌లో 450 అక్రమ ఈ-బైక్‌లు, స్కూటర్లు స్వాధీనం..!!
- ఖతార్‌లోని జెరియన్ నజీమాలో నీటి సరఫరా నిలిపివేత..!!
- కువైట్‌తో పెట్టుబడుల అవకాశాలపై భారత్ ఫోకస్..!!
- జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహమాడిన జమ్మూ కాశ్మీర్ సీఎం
- ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. భారత్‌కు యూఏఈ సంఘీభావం







