జెట్ స్కీ ప్రమాదం.. పౌరుడిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!

- November 01, 2026 , by Maagulf
జెట్ స్కీ ప్రమాదం.. పౌరుడిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!

మస్కట్: ఒమన్‌లోని అల్ అదీబా బీచ్ సమీప సముద్ర జలాల్లో జెట్ స్కీ ప్రమాదానికి గురైన ఓ పౌరుడిని కోస్ట్ గార్డ్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. సముద్ర ప్రాంతంలో సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో వ్యక్తిగత వాటర్‌క్రాఫ్ట్ (జెట్ స్కీ) నుంచి ఓ వ్యక్తి సముద్రంలో పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్ పెట్రోల్ బోట్లు అతడిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.

ఈ ఘటనలో రక్షించబడిన పౌరుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు వెల్లడించారు. సముద్ర గస్తీ సమయంలో వేగంగా స్పందించి ప్రాణాలను కాపాడిన కోస్ట్ గార్డ్ సిబ్బందిని ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com