ఇంటికి తిరిగి వచ్చే పోరాటంలో భారత ప్రవాసీయునికి పదేళ్లు
- August 27, 2016
మనామా: చెల్లుబాటు అయ్యే వీసా లేకుండా గత 10 సంవత్సరాల నుంచి బహరేన్ నివసిస్తున్న ఒక భారత జాతీయునికి తన ఇంటికి తిరిగి వెళ్లేందుకు తీవ్రంగా తపిస్తున్నాడు. బాలరాజు అనే భారతీయుడికి అధికారిక నివాస అనుమతిని కలిగి లేడు. బహరేన్ దేశంలో చట్టవిరుద్ధంగా పని చేస్తున్నాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, తాను ఒక సందర్శన వీసాతో ఇక్కడకు వచ్చినట్లు తెలిపాడు.
తన వీసా సమయ వ్యవధి దాటిన తర్వాత ఇక ఇక్కడ ఉండాలని బాలరాజు నిర్ణయించుకున్నాడు. దీనితో కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు పొందారు. బహరేన్ లో తాను నివసించే సమయంలో పలుమార్లు అనారోగ్యం పాలయనట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ "కు శుక్రవారం చెప్పారు.ఒక ఏజెంట్ ద్వారా నా సోదరుడు నాకు వీసా ఏర్పాట్లు కోసం డబ్బు చెల్లించాడు. 10 సంవత్సరాల క్రితం బహెరిన్ వచ్చిన నేను ఎన్నో రకాల చిన్న చిన్న ఉద్యోగాలు చేసానని తాను బతికేందుకు ఎక్కువగా కార్లు శుభ్రపరిచే ఉద్యోగం చేసాను, నా ఆరోగ్య సమస్యలు తీవ్రమై మంచాన పడ్డాను. ప్రస్తుత క్షమాభిక్ష కాలం (అమ్నెస్టీ కాలం) నాకు గురించి తెలియదు. అతను మానసికంగా మరియు శారీరకంగా బాధపడుతున్నట్లు ఉందని అతను ఇంటికి తిరిగి వెళ్లాలనే ఆశతో ఉన్నట్లు చెప్పారు. నేను పని చెయ్యలేక పోతున్నాను . నేను నా ఇంటికి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ, నావద్ద ఏ విధమైన డబ్బు లేదు, "బాలరాజు ఎంతో నిస్సహాయంగా చెప్పారు. గతంలో ఎందుకు నీవు సహాయం కోరుకోలేదని అడిగినప్పుడు, "నాకు తెలీదు." కన్నీళ్లు నిండిన కళ్ళతో జవాబు ఇచ్చాడు.ఆయన సహాయం కోరుతూ శుక్రవారం బాలరాజు భారత ఎంబసీ ఓపెన్ హౌస్ ని సందర్శించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







