కువైట్‌లో ప్రాపర్టీ యజమానులకు హోంశాఖ హెచ్చరిక..!!

- November 03, 2026 , by Maagulf
కువైట్‌లో ప్రాపర్టీ యజమానులకు హోంశాఖ హెచ్చరిక..!!
కువైట్: దేశంలోని నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవద్దని కువైట్ హోంశాఖ (MoI) ఆస్తుల యజమానులను హెచ్చరించింది. నిర్మాణంలో ఉన్న స్థలాలు, చలెట్లు, పశువుల కొట్టాలు, వ్యవసాయ క్షేత్రాల వద్ద భద్రతా సిబ్బందిగా పనిచేసేందుకు అక్రమంగా నివసిస్తున్న వారిని నియమించుకోవడం లేదా వారికి ఆశ్రయం కల్పించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది.
 
సెక్యూరిటీ గార్డులను నియమించుకునే ముందు వారి నివాస అనుమతి (రెసిడెన్సీ), ఇతర చట్టపరమైన పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది. వారు కువైట్‌లో చట్టబద్ధంగా నివసిస్తూ, ఉద్యోగం చేసేందుకు అనుమతి కలిగి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలని పేర్కొంది. రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారికి ఉద్యోగం కల్పించినా, ఆశ్రయం ఇచ్చినా సంబంధిత ఆస్తుల యజమానులు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com