భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!

- November 03, 2026 , by Maagulf
భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!

రియాద్: భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు జరుగుతున్న పేపర్ దిగుమతులపై గల్ఫ్ సహకార మండలి (GCC) యాంటీ డంపింగ్ విచారణ ప్రారంభించింది. భారత్‌తో పాటు చైనా, థాయ్‌లాండ్ నుంచి దిగుమతి అవుతున్న పేపర్ ఉత్పత్తులపైనా ఈ విచారణ చేపట్టాలని GCC శాశ్వత కమిటీ నిర్ణయించింది. రోల్స్ రూపంలో లేదా దీర్ఘచతురస్రాకార, చతురస్రాకార షీట్ల రూపంలో దిగుమతి అవుతున్న కోటింగ్ చేయని రైటింగ్, ప్రింటింగ్, గ్రాఫిక్ పేపర్ ఈ విచారణ పరిధిలోకి వస్తుంది.

అంతర్జాతీయ వాణిజ్యంలో హానికరమైన వాణిజ్య పద్ధతులపై పనిచేసే GCC సాంకేతిక విభాగం సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, విచారణ విధివిధానాలతో కూడిన నోటీసును 2026 నవంబర్ 2న ప్రచురించిన అధికారిక బులెటిన్ 59వ సంచికలో వెల్లడించారు.

GCC సాంకేతిక విభాగం డైరెక్టర్ జనరల్ మహ్ఫూద్ అల్ రఖాది మాట్లాడుతూ.. GCC ఉమ్మడి యాంటీ డంపింగ్, కౌంటర్‌వైలింగ్ చర్యలు, సేఫ్‌గార్డ్ నిబంధనలు, వాటి అమలు మార్గదర్శకాలు, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) యాంటీ డంపింగ్ ఒప్పందానికి అనుగుణంగా ఈ విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com