ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!

- November 03, 2026 , by Maagulf
ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!

దోహా: ఖతార్‌లో క్లాస్జెన్ 0.05% (Clasgen 0.05%) ఐ డ్రాప్స్‌కు సంబంధించి ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తయారీ ప్రక్రియలో భద్రతాపరమైన లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ మందుకు చెందిన అన్ని బ్యాచ్‌లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని (రీకాల్) ఆదేశించింది. 2026 నవంబర్ 2న జారీ చేసిన సర్క్యులర్‌లో ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ఫార్మసీ, డ్రగ్ కంట్రోల్ విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల హెల్త్ కౌన్సిల్ నుంచి అందిన ఔషధ భద్రతా హెచ్చరిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మెడిసిన్ తయారు చేసే కేంద్రంలో డేటా సమగ్రత, స్టెరైల్ తయారీ ప్రక్రియలకు సంబంధించి తీవ్రమైన లోపాలు గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట బ్యాచ్‌లకే కాకుండా Clasgen 0.05% Eye Dropsకు చెందిన అన్ని బ్యాచ్‌లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఖతార్‌లో నివసిస్తున్న పౌరులు, ప్రవాసుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత సంస్థలు, వైద్య కేంద్రాలు, వైద్య సిబ్బంది, ఇతర బాధ్యులకు సర్క్యులర్ జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com