'సామి 2' లో త్రిష...
- August 27, 2016
2003లో హరి దర్శకత్వంలో విక్రం హీరోగా నటించిన చిత్రం 'సామి'. పవర్ఫుల్ పోలీసు అధికారిగా విక్రం నటించి మెప్పించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సూర్యతో 'సింగం 3' రూపొందిస్తున్న హరి ఆ సినిమా విడుదలయ్యాక.. విక్రంతో కలసి 'సామి 2'ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబరు నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇందులో ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. తొలి భాగంలో విక్రంకు జంటగా త్రిష నటించారు. ఇప్పుడు రెండో భాగంలో ఆమె నటించే అవకాశముందని తెలుస్తోంది. దీనిగురించి దర్శకుడు మాట్లాడుతూ 'సామి 2' సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించనున్నాం.
కథ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం చిత్రీకరణకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇందులో త్రిష ఉన్నారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచాం. మరో అగ్ర కథానాయిక ఇందులో నటించనున్నారు.
మొత్తానికి ఇద్దరు నాయికలు ఇందులో ఉంటారని చెప్పారు. ఈ రెండోనాయికగా నయనతార వద్ద సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







