మిడిలిస్ట్ లో ఉద్రిక్తతలపై సౌదీ, సిరియా కీలక పిలుపు..!!
- November 05, 2026
రియాద్: మిడిలిస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలకు తక్షణమే ముగింపు పలికి, పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చకుండా ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా పిలుపునిచ్చారు. రియాద్‌లో వీరిద్దరూ సమావేశమై ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందెబ్ జలసంధి, హార్ముజ్ జలసంధుల్లో అంతర్జాతీయ నౌకాయాన భద్రతకు ముప్పు కలిగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఇరువురు నేతలు కోరారు. సైనిక ఉద్రిక్తతలు మరింత పెరిగితే ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతతో పాటు సముద్ర రవాణా, ఇంధన సరఫరాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సౌదీ అరేబియా, సిరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకునే మార్గాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాల అభిప్రాయాల్లో సారూప్యత ఉండటాన్ని నేతలు స్వాగతించారు. ఇరు దేశాల మధ్య సమన్వయం, సంప్రదింపులు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
పలు కీలక ఒప్పందాలపై సంతకాలు
సౌదీ అరేబియా, సిరియా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పారిశ్రామిక రంగంలో సహకారానికి సంబంధించి సౌదీ పరిశ్రమలు, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ, సిరియా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం, వినియోగదారుల పరిరక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
అలాగే ఇరు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య సహకార ఒప్పందం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో మరో రెండు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సౌదీ డెవలప్‌మెంట్ ఫండ్, సిరియా ప్రతినిధుల మధ్య కూడా పలు ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణం, ఆర్థిక సేవల రంగాల్లో వివిధ ప్రాజెక్టులకు సహకారం అందించనున్నారు.
తాజా వార్తలు
- మా ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం..అయినా వెనక్కి తగ్గను: డోనాల్డ్ ట్రంప్
- ఉపాధి హామీ పని దినాలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు రిక్వెస్ట్
- మిడిలిస్ట్ లో ఉద్రిక్తతలపై సౌదీ, సిరియా కీలక పిలుపు..!!
- దుబాయ్‌లో అద్దె చెల్లించని వ్యాపారికి షాక్..!!
- లండన్ లో ఒమన్ పర్యాటక ప్రత్యేకతల ప్రదర్శన..!!
- బహ్రెయిన్ – ఇరాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు..!!
- ఖతార్‌లో మోటోజీపీ 2026.. ప్రేక్షకుల కోసం గైడ్ లైన్స్ విడుదల..!!
- కువైట్‌లో ఘనంగా ‘దీపావళి దివానియా’ వేడుకలు..!!
- మలేషియా: తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- GymNation launches AED 1 million Foundation to back local talent, communities and wellness innovation







