బహ్రెయిన్ – ఇరాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు..!!
- November 05, 2026
మనామా: బహ్రెయిన్, ఇరాక్ దేశాల మధ్య చిరకాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, ఇరాక్ ప్రధానమంత్రి అలీ ఫలేహ్ అల్ జైదీతో గుడైబియా ప్యాలెస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత అభివృద్ధి చేసుకునే మార్గాలపై చర్చించారు.
బహ్రెయిన్‌తో సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరాక్ ప్రధాని చేస్తున్న కృషిని ప్రిన్స్ సల్మాన్ ప్రశంసించారు. బహ్రెయిన్‌పై ఇరాన్ చేపట్టిన దాడులను ఖండించడంతో పాటు, తమ దేశానికి సంఘీభావం తెలిపిన ఇరాక్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో మధ్యప్రాచ్యంలో తాజా పరిణామాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంతో పాటు శాంతిని ప్రోత్సహించే కార్యక్రమాలకు మద్దతు కొనసాగించాలని ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి.
రెండు దేశాల అభివృద్ధికి దోహదపడే రంగాల్లో సహకారం, సమన్వయాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలను కూడా సమీక్షించారు. ఇరాక్ ప్రధానికి బహ్రెయిన్‌లో అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, ఇరాక్ జాతీయ గీతాలను ఆలపించారు. అనంతరం ప్రిన్స్ సల్మాన్, ఇరాక్ ప్రధాని గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. బహ్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రిన్స్ సల్మాన్ చేస్తున్న కృషికి ఇరాక్ ప్రధాని అలీ ఫలేహ్ అల్ జైదీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
- తెలంగాణ పోలీసుల ఆరోగ్యానికి ‘ఫిట్‌కాప్’.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక చర్యలు
- 5G-A ఇంటర్నెట్ వేగంలో గల్ఫ్‌లోనే కువైట్ టాప్..!!
- 2030 నాటికి జీసీసీ రైల్వే నెట్వర్క్.. బహ్రెయిన్ సమీక్ష..!!
- ఒమన్‌లో భారీగా సిగరెట్లు, నమిలే పొగాకు పట్టివేత..!!
- గ్లోబల్ టెక్ హబ్‌గా దోహా.. రెండోసారి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026..!!
- యూఏఈ పిల్లల్లో తగ్గుతున్న చేతిరాత నైపుణ్యం..!!
- 122 సాంకేతిక రంగాలకు సౌదీ నాణ్యత పరీక్షల విస్తరణ..!!
- ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అభివృద్ధి పనులను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్







