ఉపాధి హామీ పని దినాలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు రిక్వెస్ట్
- November 05, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం కింద కల్పిస్తున్న పనిదినాలను 200 రోజులకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అదనపు పనిదినాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించవచ్చని వివరించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు పర్యటించిన కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, వర్షాభావం కారణంగా వ్యవసాయ రంగానికి జరిగిన నష్టంపై సీఎం కేంద్ర బృందానికి వివరించారు.
తుఫాన్లు, ఎల్నినో ప్రభావంతో తీవ్ర నష్టం.. వారం రోజుల్లో కేంద్రానికి నివేదిక
ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలు తరచూ తుఫాన్ల ప్రభావానికి గురవుతుండగా, ఎల్నినో పరిస్థితుల కారణంగా రాయలసీమతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్ర కరవును ఎదుర్కొంటున్నాయని చంద్రబాబు వివరించారు. ఒకవైపు తుఫాన్ల కారణంగా భారీ వర్షాలు, వరదలు తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తుంటే.. మరోవైపు వర్షాభావంతో ఇతర ప్రాంతాల్లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రజలకు కేంద్రం నుంచి అదనపు సహాయం అందించాలని కోరారు. కరవు ప్రభావం, పంట నష్టం, ప్రజల ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ పర్యటనకు సంబంధించిన సమగ్ర నివేదికను వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని బృందం వెల్లడించింది. కేంద్రం నుంచి అందే సహాయంపై రాష్ట్రంలోని కరవు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- మా ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం..అయినా వెనక్కి తగ్గను: డోనాల్డ్ ట్రంప్
- ఉపాధి హామీ పని దినాలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు రిక్వెస్ట్
- మిడిలిస్ట్ లో ఉద్రిక్తతలపై సౌదీ, సిరియా కీలక పిలుపు..!!
- దుబాయ్లో అద్దె చెల్లించని వ్యాపారికి షాక్..!!
- లండన్ లో ఒమన్ పర్యాటక ప్రత్యేకతల ప్రదర్శన..!!
- బహ్రెయిన్ – ఇరాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు..!!
- ఖతార్లో మోటోజీపీ 2026.. ప్రేక్షకుల కోసం గైడ్ లైన్స్ విడుదల..!!
- కువైట్లో ఘనంగా ‘దీపావళి దివానియా’ వేడుకలు..!!
- మలేషియా: తెలుగు ఎక్స్పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- GymNation launches AED 1 million Foundation to back local talent, communities and wellness innovation







