తెలంగాణకు చలి హెచ్చరిక జారీ

- November 06, 2026 , by Maagulf
తెలంగాణకు చలి హెచ్చరిక జారీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఉష్ణోగ్రతల పతనం – ఏయే జిల్లాల్లో ఎంత?
రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర మరియు మధ్య జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి, సుమారు 13 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉంది. అలాగే, భాగ్యనగరం హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

తేలికపాటి వర్షాలకు అవకాశం
ఒకవైపు చలి తీవ్రత పెరుగుతుండగా, మరోవైపు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా దక్షిణ, తూర్పు తెలంగాణతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి సమయాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా ప్రాంతాలన్నింటిలోనూ వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com