30 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవం..!
- November 06, 2026
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య మరోసారి దీపాల వెలుగులతో జిగేల్‌మననుంది.పదో దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అక్కడి అధికారులు, నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సారి సరయూ నది తీరంలోని 56 ఘాట్లపై ఏకంగా 30 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది సుమారు 26 లక్షల దీపాలను వెలిగించి రికార్డు సృష్టించగా, ఈసారి అంతకంటే ఎక్కువ దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు నెలకొల్పాలని భావిస్తున్నారు. ఇందుకోసం నగరంలోని ప్రధాన కూడళ్లు, ఆలయాలు, ఘాట్లను విద్యుత్ దీపాలు, ప్రత్యేక అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు, పర్యాటకులను ఆకట్టుకునేలా అయోధ్య నగరమంతా పండుగ శోభను సంతరించుకుంటోంది.
నవంబర్ 5 నుంచి 8 వరకు వేడుకలు..రికార్డు స్థాయిలో దీపాల వెలుగులు!
ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు దీపోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరాముడి జన్మభూమిగా ప్రసిద్ధి చెందిన అయోధ్యలో దీపావళి వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శ్రీరాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపాలు వెలిగించే సంప్రదాయాన్ని ఈ వేడుకల్లో ప్రతిబింబిస్తారు. ఇందులో భాగంగా సరయూ నది తీరంలోని ఘాట్లపై లక్షలాది మట్టి దీపాలు వెలిగించనున్నారు. దీపాల వెలుగులతో సరయూ నది తీరం అద్భుతంగా కనిపించనుంది. ఈ వేడుకలను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలివచ్చే అవకాశం ఉంది. గతేడాది రికార్డును అధిగమించి 30 లక్షలకు పైగా దీపాలతో కొత్త చరిత్ర సృష్టించడమే ఈ ఏడాది నిర్వాహకుల ప్రధాన లక్ష్యంగా ఉంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో యు.ఎస్. పోలో అసోసియేషన్ కొత్త స్టోర్ ప్రారంభం..
- 30 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవం..!
- యూఏఈలో గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌లకు కొత్త పరీక్షలు..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- నకిలీ ప్రకటనల పై హెచ్చరించిన ఒమన్ పోలీసులు..!!
- కువైట్ విమానాశ్రయంలో కొత్త ఆంక్షలు..!!
- రెస్టారెంట్లు, హోటళ్లకు BD3,000 వరకు జరిమానా ప్రతిపాదన..!!
- వారంలోనే QR572 మిలియన్లు దాటిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- జోర్డాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026..







