తెలంగాణకు చలి హెచ్చరిక జారీ
- November 06, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతల పతనం – ఏయే జిల్లాల్లో ఎంత?
రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర మరియు మధ్య జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి, సుమారు 13 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉంది. అలాగే, భాగ్యనగరం హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
తేలికపాటి వర్షాలకు అవకాశం
ఒకవైపు చలి తీవ్రత పెరుగుతుండగా, మరోవైపు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా దక్షిణ, తూర్పు తెలంగాణతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి సమయాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా ప్రాంతాలన్నింటిలోనూ వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి మరో వాన గండం..
- తెలంగాణకు చలి హెచ్చరిక జారీ
- హైదరాబాద్‌లో యు.ఎస్. పోలో అసోసియేషన్ కొత్త స్టోర్ ప్రారంభం..
- 30 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవం..!
- యూఏఈలో గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌లకు కొత్త పరీక్షలు..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- నకిలీ ప్రకటనల పై హెచ్చరించిన ఒమన్ పోలీసులు..!!
- కువైట్ విమానాశ్రయంలో కొత్త ఆంక్షలు..!!
- రెస్టారెంట్లు, హోటళ్లకు BD3,000 వరకు జరిమానా ప్రతిపాదన..!!
- వారంలోనే QR572 మిలియన్లు దాటిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!







