ఎగ్ డిమ్పోస్టో
- July 30, 2015
ఎగ్ డిమ్పోస్టో
కావలిసిన పదార్ధాలు
ఎగ్స్ - నాలుగు
గసగసాలు - మూడు స్పూన్లు
ఆవనూనె - మూడు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూ
యాలకులు, లవంగాలు - నాలగేసి చొప్పున
దాల్చిన చెక్క - చిన్న ముక్క
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
పచ్చిమిర్చి - మూడు
కారం - ఒక స్పూను
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
తయారీ విధానం
ముందు రోజు గసగసాలను నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. తరువాతి రోజు వాటిని, మిర్చితో కలిపి మిక్సీలో వెయ్యాలి. గుడ్లను ఉడికించి, తొక్క తీసి చిన్న చిన్న ముక్కల్లా కోసి, ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి, దానిలో లవంగాలూ, దాల్చినచెక్క, యాలకులు వేసి వేయించి తరువాత కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను కూడా వేసి బాగా వేయించాలి. తరువాత ఉల్లితరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, పసుపు వేసి అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత గసగసాల పేస్ట్ కూడా వేసి కలపాలి. కొంత సేపటికి ఇది గ్రేవీలా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో మిగిలిన ఆవనూనె కొద్దిగా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది అన్నంతో గానీ రోటీతో గానీ తినడానికి బాగుంటుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







