ఆమె గెలుపు

- July 30, 2015 , by Maagulf
ఆమె గెలుపు

సమస్యల ప్రళయం నన్ను చుట్టుముట్టి భాదల 

ఊభిలొకి మనసు కూరుకు పోయినాక 

 

నాకు ఆశల రెక్కలు తొడిగి ఒడ్డున కూర్చొన్న 

నువ్వు నీ మమతల కొంగు అందించి 

ఏదో తెలియని ఊహల లోకం లోకి లాగేస్తావు 

 

నన్ను నేను కోల్పోయి బాధ్యతలు లేని 

సోమరితనంలో ముసుగు తన్నినప్పుడు 

నీ అరుపుల చరుపులతో నన్ను 

కర్యోన్ముకునిగా మలచుతావు  

 

ఆకాశంలో మబ్బుల్లా,నీకు నాకు మధ్య 

'మాట పట్టింపు' మొలక మొలిచి, 

మనసు ముడుచుకున్నప్పుడు  

 

కుండ పోత వర్షం చివర నీఒక వెచ్చని సూరిడులా  

చిరు చిరు చిర్నవ్వులతో,నాలో పేరుకున్న పెంకి తనాన్ని 

దులిపి,నా 'అహం' ఉనికిని చెరిపేస్తావు  

 

సుతి మెత్తని నీ భావుకతలో ముంచి 

నన్ను నేను కోల్పోయ్యే వెర్రిగా మారుస్తావు  

 

పువ్వులా నువ్వు ఉంటూనే నాలో..లోపలి 

అసహనాల ముళ్ళను నీ సున్నితత్వపు రెమ్మలతో 

అనిచివేస్తావు 

 

ఒంపు సొంపులతో మెలికలు తిరుగు నదివి, నిన్ను

ఎదురీద లేని అశక్తున్ని నన్ను చేసి,నీ ప్రవాహ వేగంలో 

కలుపుకు ప్రయాణం సాగిస్తావు   

 

నీదైన నీ నాగస్వరంతో మైమరపించి

నాగును నన్ను చేసి ఆడిస్తావు

 

సర్వం నీకన్నా తక్కువను చేసి,జయించి 

ఓటమిలో నన్ను బంధించి ఎప్పుడూ ..

 

నీ గెలుపుతో 

హృదయ రాణివై ఏలుతునే ఉంటావు ....  

 

(13-04-2014)

జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com