ఫేస్ వాష్ జెల్‌తో ముఖం కడుక్కుంటున్నారా?
- July 30, 2015
ప్రతీరోజూ ముఖాన్ని తరచూ శుభ్రం చేసుకోవడం అనే అలవాటు చాలా మంచిదే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాల ఫ్రూటీ ఫేస్ వాష్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫ్రూటీ ఫ్లేవర్సే కదా ఏమవుతుంది అనుకునేరు. అన్ని రకాల ఫ్రూట్ ఫేస్ వాష్‌లు అందరి శరీర తత్వానికి పడవు. ముఖ్యంగా ముఖం మీద ఉన్న చర్మం మన శరీరంలోకెల్లా అతి సున్నితమైనది. అందుకే ఈ ఫేస్ వాష్‌లతో ముఖం కడుక్కునేవారు కొంత అప్రమత్తంగా ఉండాలి. చర్మతత్వాన్ని బట్టి వీటిని ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ వీటిని వాడినా ఎక్కువ నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఎక్కువగా రబ్ చేయకుండా సున్నితంగ వాష్ చేసుకోవాలి. మరీ సున్నిత చర్మం ఉన్న వారు గ్రీన్‌టీ ఎసెన్స్ ఉన్న ఫేస్‌వాష్‌లను ఎంచుకోవాలి. మేకప్ తొలగించిన వెంటనే మామూలు నీటితోనే ముఖం కడుక్కోవాలి. ఫేస్‌వాష్ జెల్‌ని వాడకూడదు. దీనివల్ల చర్మ గ్రంధులు మూసుకుపోతాయి. ఒక్కోసారి ఇన్ఫెక్షన్లూ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మేకప్ తొలగించడానికి చల్లని నీళ్లను ఉపయోగించి తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది, మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాదు చర్మం మీది జిడ్డుని తొలగించుకోవడానికి కొందరు టిష్యూ పేపర్లను కూడా వాడతారు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోయి, బరకగా మారుతుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







