డిజేబుల్డ్ డ్రైవర్స్‌కి స్పెషల్ పార్కింగ్ కార్డ్స్
- August 28, 2016
దుబాయ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డిజేబుల్డ్ డ్రైవర్స్‌కి ప్రత్యేకమైన పార్కింగ్ కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని వారి లైసెన్స్‌లో రిజిస్టర్ చేయనున్నారు. దుబాయ్ పోలీస్ ఫర్ ఆపరేషన్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మరియు చీఫ్ ఆఫ్ ది ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ మేజర్ జనరల్ మొహమ్మద్ సైఫ్ అల్ జాఫిన్ మాట్లాడుతూ, ప్రత్యేకంగా డిజేబుల్డ్ కోసం రూపొందించే కార్డ్స్‌పై, ఆయా వ్యక్తుల సిగ్నేచర్ తప్పనిసరి అనీ ఈ విధానం ద్వారా అక్రమాలను అరికట్టవచ్చని వివరించారు. డిజేబుల్డ్ సైన్ బోర్డ్స్‌తో కొందరు దుర్వినియోగానికి పాల్పడుతున్నారనీ, వారి కోసం కేటాయించిన పార్కింగ్ స్లాట్స్‌ని ఇతరులు కూడా వినియోగించుకుంటున్నారని మేజర్ జనరల్ ఆల్ జఫిన్ చెప్పారు. అలాగే ట్రాఫిక్ కౌన్సిల్ - హెల్త్ అథారిటీ మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మధ్య లింక్ ఉండాలనీ, తద్వారా మరింత సమర్థవంతంగా అర్హులకే డిజేబుల్డ్ పార్కింగ్ స్లాట్స్ కేటాయించడానికి వీలవుతుందని చెబుతోంది.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







