నవశక్తులు
- November 14, 2026
ప్రకృతిలా స్వఛ్ఛంగా పూలలా అందంగా
ప్రతీరోజు వికసించే సుమాల పరిమళంగా
ప్రతీ ఉదయము ఉషోదయపు వెలుగుగా
ప్రతి మదిలోను వికసిత హరివిల్లుగా,,,
కురిసే చిరుజల్లుల ఆహ్లాదంగా
కమ్మని పలుకులు తేనెలూరు
కల్మషం లేని చిరునవ్వే ఆభరణంగా
కనుల ముందు కదలాడే అనుబంధంగా
అందం అమాయకత్వంతో అలరించే ప్రాయం
అహం తెలియని మనసంతా మాధుర్యం
అపురూపం అల్లరితో మరచేటి సమయం
అల్లుకుపోయే తీగలా ప్రేమపంచే ఆనందం,,,
స్వేచ్ఛగా ఎగిరేటి రంగుల సీతాకోక చిలుకగా
సంతోష సరాగాలతో కూడిన మధురగీతంగా
స్వచ్చమైన మనసులతో కూడిన చిరునామాగా
సరికొత్త ఆశలు ఆశయాలకి సరికొత్త ప్రేరణగా,,,
నెహ్రూ కన్న కలలు సాకారం చేసే దివ్వెలుగా
నేటి యుగంలో రాబోయే రోజుల ఆశాకిరణాలుగా
నవతరానికి నిర్మాతలు భావిభారత పౌరులుగా
తల్లితండ్రుల ప్రేమకి ప్రతిరూపాలైన నవశక్తులు...
--యామిని కోళ్ళూరు ✍️
తాజా వార్తలు
- సౌదీ అరేబియా విమాన సర్వీసుల నిలిపివేతను పొడిగించిన ఎయిర్ ఇండియా, ఇండిగో
- నాలుగు గంటలకు పైగా నిలిచిపోయిన అమెరికా విమాన సర్వీసులు..
- ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాలపై 7,000కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు: జీసీసీ ప్రధాన కార్యదర్శి
- సీఐఐ సదస్సు విజయవంతం..
- కొత్తగూడెం విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ !
- బాధ్యులను జవాబుదారీగా నిలపాలని కోరింది.
- ధోఫార్ మౌంటైన్స్ కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు ..!!
- బహ్రెయిన్‌లో మనామా–ముహర్రఖ్ మధ్య రాకపోకలకు ఊరట..!!
- ఆంక్షలు లేకుండా మానవతా సాయం అందించాలని ఖతార్ పిలుపు..!!
- అబుదాబి హోటల్లో ఘర్షణ.. 8 మందికి 6 నెలల జైలు..!!







