సౌదీ అరేబియాలో బోస్ స్పీకర్లు రీకాల్..!!
- November 16, 2026
రియాద్: బ్యాటరీలు అధికంగా వేడెక్కి మంటలు చెలరేగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో 2,214 బోస్ (Bose) స్పీకర్లను సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రీకాల్ పరిధిలో Bose S1 Pro+ మరియు Bose S1 Pro మోడల్ స్పీకర్లు ఉన్నాయి. వినియోగ సమయంలో వీటిలోని బ్యాటరీలు అధికంగా వేడెక్కే అవకాశం ఉందని, దీనివల్ల అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ మోడళ్లను వినియోగిస్తున్న వారు వెంటనే వాటి వాడకాన్ని నిలిపివేయాలని అధికారులు సూచించారు. బ్యాటరీని ఉచితంగా మార్చుకునేందుకు 01126669932 నంబర్లో సంప్రదించాలని కోరారు. తమ వద్ద ఉన్న స్పీకర్లు రీకాల్ పరిధిలోకి వస్తాయో లేదో వినియోగదారులు (http://Recalls.sa) వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో హౌసింగ్ ఫైనాన్సింగ్‌కు భారీ స్పందన..!!
- సౌదీ అరేబియాలో బోస్ స్పీకర్లు రీకాల్..!!
- కువైట్‌లో వాహన బీమా పాలసీలకు కొత్త నిబంధనలు..!!
- ఖతార్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్‌లో OMR100 మిలియన్ల బాండ్ల జారీ..!!
- యూఏఈలో ‘హోప్ మేకర్స్’కు విశేష స్పందన..!!
- రియాద్‌లో ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్ 2026 వేడుకలు
- దోహాలో ఘనంగా ICBF డే 2026 వేడుకలు..19 మందికి సేవా పురస్కారాలు
- విద్యార్థుల భద్రతకు కృషి చేస్తున్న స్కూల్ బస్సు డ్రైవర్లు, సిబ్బందికి దుబాయ్ పోలీసుల సత్కారం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కూటమి రెడీ..







