సౌదీ అరేబియాలో బోస్ స్పీకర్లు రీకాల్..!!

- November 16, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో బోస్ స్పీకర్లు రీకాల్..!!

రియాద్: బ్యాటరీలు అధికంగా వేడెక్కి మంటలు చెలరేగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో 2,214 బోస్ (Bose) స్పీకర్లను సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రీకాల్ పరిధిలో Bose S1 Pro+ మరియు Bose S1 Pro మోడల్ స్పీకర్లు ఉన్నాయి. వినియోగ సమయంలో వీటిలోని బ్యాటరీలు అధికంగా వేడెక్కే అవకాశం ఉందని, దీనివల్ల అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ మోడళ్లను వినియోగిస్తున్న వారు వెంటనే వాటి వాడకాన్ని నిలిపివేయాలని అధికారులు సూచించారు. బ్యాటరీని ఉచితంగా మార్చుకునేందుకు 01126669932 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. తమ వద్ద ఉన్న స్పీకర్లు రీకాల్ పరిధిలోకి వస్తాయో లేదో వినియోగదారులు (http://Recalls.sa) వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com