సౌదీ అరేబియాలో పేపర్ మిడిల్ ఈస్ట్ ఎగ్జిబిషన్..భారత పెవిలియన్‌ను ప్రారంభించిన కాన్సుల్ జనరల్
- November 17, 2026
భారతీయ ఉత్పత్తులు, తయారీ సామర్థ్యాలను ప్రదర్శించిన ప్రతినిధులు.. కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించాలని సూచన
జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహిస్తున్న మూడో పేపర్ మిడిల్ ఈస్ట్ సౌదీ అరేబియా ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో భారత కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి పాల్గొన్నారు. జెడ్డా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జనరల్ రమేజ్ బిన్ మన్సూర్ అల్‌ఘాలిబ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి భారత పెవిలియన్‌ను ప్రారంభించారు. పేపర్, ప్యాకేజింగ్, అనుబంధ రంగాల్లో భారతదేశ తయారీ సామర్థ్యాలు, విభిన్న ఉత్పత్తులు, పరిష్కారాలను ఈ పెవిలియన్‌లో ప్రదర్శించారు.
భారతీయ ఎగ్జిబిటర్లతో మాట్లాడిన కాన్సుల్ జనరల్, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించాలని, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. భారత్-సౌదీ అరేబియా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు.
ఈ ఎగ్జిబిషన్‌లో భారత వ్యాపార ప్రతినిధి బృందం పాల్గొనేలా సమన్వయం చేసిన పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (PHDCCI) ప్రయత్నాలను కాన్సుల్ జనరల్ అభినందించారు.
పేపర్, ప్యాకేజింగ్ రంగాల్లో భారతీయ సంస్థలకు సౌదీ అరేబియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపార అవకాశాలను విస్తరించేందుకు ఈ ప్రదర్శన వేదికగా నిలుస్తోంది.
తాజా వార్తలు
- భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- డీఎస్పీలు, అదనపు ఎస్పీల పదోన్నతుల సమస్యకు తెర..డీజీపీ ఆనంద్ చొరవతో పరిష్కారం
- ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్..
- యూఏఈ నేషనల్ డేకి దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు
- సౌదీ అరేబియాలో పేపర్ మిడిల్ ఈస్ట్ ఎగ్జిబిషన్..భారత పెవిలియన్‌ను ప్రారంభించిన కాన్సుల్ జనరల్
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ‘టుగెదర్ రీలోడెడ్’ సంగీత విభావరి
- అబుదాబి హోటల్లో ఘర్షణ కేసు.. 8 మంది నిందితులకు ఊరట..!!
- సౌదీలో కార్మికులను ఇతరులకు అప్పగిస్తే.. యజమానులకు 6 నెలల జైలు..!!
- ఒమన్‌లో కీలక రహదారులపై ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!







