ఒమన్‌లో కీలక రహదారులపై ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!
- November 17, 2026
మస్కట్: ఒమన్‌లోని పలు ప్రధాన రహదారులపై ట్రక్కుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ విభాగంలోని రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
ఆంక్షలు అమలయ్యే రహదారులు:
* సుల్తాన్ థువైనీ బిన్ సయీద్ రోడ్డులో అల్ సహ్వా టవర్ రౌండ్అబౌట్ నుంచి అల్ దఖిలియా గవర్నరేట్ వైపు వెళ్లే మార్గం.
* ఇజ్కీ – సినావ్ రహదారి (రెండు వైపులా).
* ఇజ్కీ – నిజ్వా రహదారి (రెండు వైపులా).
నిర్దేశించిన సమయాల్లో ఈ మార్గాల్లో ట్రక్కుల రాకపోకలు నిలిపివేస్తామని ROP స్పష్టం చేసింది. వాహనదారులు, ముఖ్యంగా ట్రక్కుల డ్రైవర్లు ఈ ఆంక్షలను గమనించి తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- అబుదాబి హోటల్లో ఘర్షణ కేసు.. 8 మంది నిందితులకు ఊరట..!!
- సౌదీలో కార్మికులను ఇతరులకు అప్పగిస్తే.. యజమానులకు 6 నెలల జైలు..!!
- ఒమన్‌లో కీలక రహదారులపై ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!
- ఆసియాన్-భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం: ప్రధాని మోదీ
- యూఏఈ ఇన్నోవేట్స్ 2026 అవార్డులు ప్రదానం..దుబాయ్ పోలీసులకు అత్యున్నత పురస్కారం
- ఖతార్‌లో కొత్తగా 331 ప్రొఫెషనల్ లైసెన్సులు..!!
- తొలి 9 నెలల్లో 50.4 మిలియన్ మంది ప్రయాణికులకు సేవలందించిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- కువైట్ ప్రవాసుల్లో భారతీయులే టాప్..!!
- బహ్రెయిన్ లో ఉగ్రవాద కేసులో జీవిత ఖైదు.. పలువురికి 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- హోర్మజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్ పై దాడి







