భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు

- November 17, 2026 , by Maagulf
భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు

పార్లమెంటరీ సహకారాన్ని మరింత విస్తరించడంపై దృష్టి

దోహా: భారత్–ఖతార్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు జరిగాయి. ఖతార్‌లో భారత రాయబారి డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి, ఖతార్ షూరా కౌన్సిల్ సభ్యుడు, ఖతార్–ఆసియా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ ఛైర్మన్ అహ్మద్ బిన్ హిత్మీ అల్-హిత్మీతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పార్లమెంటరీ స్థాయిలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం, భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.

ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో పార్లమెంటరీ పరస్పర చర్చలు, సహకారం కీలక పాత్ర పోషిస్తాయని ఈ సమావేశం ప్రాధాన్యతను చాటిచెప్పింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com