బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- November 22, 2026
దోహా: బహ్రెయిన్‌లోని పౌర పారిశ్రామిక కేంద్రంపై ఇరాన్ జరిపిన దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి బహ్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని పేర్కొంది.
ఈ మేరకు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి (ఐరాస) చార్టర్‌ను, పొరుగు దేశాల మధ్య సత్సంబంధాల సూత్రాలను బహిరంగంగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది.
ఆర్థిక సంస్థలు, పౌర మౌలిక సదుపాయాలు, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకునే దాడులను ఖతార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఇలాంటి దాడులు కొనసాగడం ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. అంతేకాకుండా, దౌత్యపరమైన ప్రయత్నాలకు విఘాతం కలిగించడంతో పాటు ప్రాంతంలో శాంతి, భద్రతలను నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను బలహీనపరుస్తాయని పేర్కొంది.
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా అన్ని దేశాలు సంయమనం పాటించాలని, శాంతి స్థిరత్వాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖతార్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!
- GTA 6 గేమ్‌పై యూఏఈ హెచ్చరిక..!!







