దీపావళికి విడుదలకానున్న 'లక్ష్మీ బాంబ్'
- August 29, 2016
మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో చేస్తోన్న చిత్రం 'లక్ష్మీ బాంబ్'. గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ''చాలెంజింగ్ పాత్ర చేస్తున్నాను. ఎగ్జయిటింగ్ సబ్జెక్ట్. ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్. జడ్జ్ పాత్రలో కనపడతాను. సింగిల్ షెడ్యూల్లో ఏకధాటిగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మనోజ్ ఆధ్వర్యంలో చేశాం.
దీపావళికి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అని అన్నారు.
దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ '' జయప్రద జస్టిస్ రుద్రమదేవి తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ చేస్తుంది లక్ష్మీయే. మనోజ్ క్లైమాక్స్ ఫైట్ కంపోజ్ చేయడం ఎసెట్ అవుతుంది'' అని అన్నారు. ఈ చిత్రానికి డ్యాన్స్: కిరణ్, ఆర్ట్: రఘుకులకర్ణి, ఫైట్స్: రాంబాబు, వెంకట్, నందు, ఎడిటింగ్ : నందమూరి హరి, పాటలు : కరుణాకర్, కాసర్లశ్యామ్, సంగీతం : సునీల్‌కశ్యప్, కెమెరా : మల్హర్‌భట్ జోషి, కథ, మాటలు : డార్లింగ్ స్వామి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







