విశాల్ కథానాయకుడుగా 'ఒక్కడొచ్చాడు'
- August 29, 2016
ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఓ వ్యక్తి నిత్యం ప్రశ్నిస్తూ ఉంటాడు. వాళ్లకు ఏ అన్యాయం జరిగినా తానున్నానంటూ ముందుకొస్తాడు. ఆ కథను 'ఒక్కడొచ్చాడు' టైటిల్‌తో విశాల్ కథానాయకుడుగా చేస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉంటూనే ఒక పవర్ఫుల్, పర్పస్‌ఫుల్ ఫిలింగా రూపొందుతోంది. సురాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాత జి.హరి సోమవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. హీరోయిన్ తమన్నాకి మరో హీరోయిన్ శ్రుతిహాసన్ పాట పాడడం మరో విశేషం.ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ '' దర్శకుడు ఈ స్టోరీ లైన్ చెప్పగానే అన్ని సినిమాలూ ఆపేసి ఇదే చేయాలని డిసైడ్ అయ్యాను.
అంతగా ఈ కథకు నేను కనెక్ట్ అయ్యాను. ఇందులో ఒక కొత్త పాయింట్ ఉంది. అది అన్ని ఊళ్ళల్లో అందరూ నిత్యం ఎదుర్కొనేదే. ఆ పాయింట్ చుట్టూ అల్లిన మంచి కమర్షియల్ సినిమా ఇది.
ఇందులో నా లుక్, క్యారెక్టరైజేషన్ ఇంతకుముందు సినిమాలన్నింటి కంటే డిఫరెంట్‌గా ఉంటుంది. జగపతిబాబు ఒక ముఖ్యపాత్ర చేస్తున్నారు. తరుణ్ అరోరా విలన్‌గా నటిస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.
అలాగే సెప్టెంబర్ 12 నుండి మిస్కిన్ డైరెక్షన్లో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మరో చిత్రం ప్రారంభిస్తున్నాం' అని చెప్పారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







